Taiwan President: చూస్తూ ఊరుకోబోం.. తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taiwan President: యూఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీని కలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా బెదిరించినప్పటికీ దౌత్యపరమైన ఒప్పందాల కోసం తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ న్యూయార్క్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్‌కు చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ అంతర్గత వ్యవహారాలను ఈ పర్యటనలో అగ్రరాజ్యం అమెరికాతో చర్చిస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా హెచ్చరించింది. అంతేకాదు.. పర్యటనకు ముందు సాయ్ చేసిన వ్యాఖ్యలను ధిక్కార స్వరంగా భావిస్తున్నామని స్పష్టం చేసింది. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ పర్యటనకు ముందు మాట్లాడుతూ.. తైవాన్‌కు ప్రపంచంతో సంబంధాలు కొనసాగించే హక్కు ఉందని, బయటి శక్తులు ఈ మేరకు ఎలాంటి ప్రభావం తమపై చూపలేరంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆమె మధ్యలో కాలిఫోర్నియాను సందర్శించాల్సి ఉండగా.. యూఎస్ హౌజ్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. అయితే.. ఈ భేటీ పరిణామంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది.
Read Also: Rahul Gandhi: రాహుల్ అనర్హతపై స్పందించిన జర్మనీ.. ఏమందంటే?
Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
గత ఏడాది ఆగస్టులో అప్పటి యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ద్వీపాన్ని సందర్శించిన తర్వాత తైవాన్ అధ్యక్షురాలి అమెరికా పర్యటన వచ్చింది. నాన్సీ పెలోసి 25 సంవత్సరాలలో తైవాన్‌ను సందర్శించిన అత్యున్నత స్థాయి ఎన్నికైన యూఎస్ అధికారి అయ్యారు. ఆమె పర్యటన అనంతరం తైవాన్ ద్వీపం చుట్టూ చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. పెలోసి పర్యటనకు వ్యతిరేకంగా చైనా పలు హెచ్చరికలు చేసింది.
తైవాన్ అధ్యక్షురాలు అమెరికా చట్టసభ స్పీకర్‌ను కలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇది చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే అంశంగా భావించక తప్పదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. తైవాన్ అధ్యక్షురాలు మెక్‌కార్తీని కలిస్తే.. హౌస్ స్పీకర్, తైవాన్ నాయకుడి మధ్య యూఎస్ గడ్డపై ఇది మొదటి సమావేశం అవుతుంది. ఈ ఆలోచన చైనాకు కోపం తెప్పిస్తోంది. ఈ సమావేశం వాస్తవానికి లాస్ ఏంజెల్స్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో జరగాలని నిర్ణయించారు, అయితే లైబ్రరీ ఇంకా సమావేశాన్ని ధృవీకరించలేదు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!