030కి ముందు మానవులు చంద్రునిపై జీవించి పని చేసే అవకాశం ఉందని నాసా అధికారి ఒకరు తెలిపారు.ఆర్టెమిస్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత ఈ దశాబ్ధం ముగిసేలోపు మానవులు చంద్రునిపై నివసించవచ్చని నాసా అధికారి వెల్లడించారు.
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో కాల్పులు జరగగా ఐదుగురు మృతి చెందారు.
snowstorm buries western New York: అమెరికా వాణిజ్యనగరం న్యూయార్క్ వ్యాప్తంగా భారీగా హిమపాతం కురుస్తుంది. దీంతో నగరంలోని రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్ బఫెల్లో ప్రాంతంలో మంచు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజా జీవితం స్తంభించింది. బఫెలో ప్రాంతంలో రోడ్లు మూసేశారు. అనేక విమానాలు రద్దు అయ్యాయి. నగరంలో ప్రయాణాలు దాదాపుగా పరిమితం చేయబడ్డాయి.
సాధారణంగా యుక్త వయసుకు వచ్చేసరికి అందరిలో పొడవు పెరగడం అనే ప్రక్రయ ఆగిపోతుంది. అనంతరం పొడవు పెరగాలనుకున్నా అయ్యే పని కాదు. కానీ అమెరికాకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధుడికి ఇది సాధ్యపడింది.
ఇండోనేషియాలోని బాలిలో ఓ ప్రముఖ హోటల్ వేదికగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు సహా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గాన్ని కనుగొనాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో రెండు పురాతన యుద్ధ విమానాలు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఓవర్ డల్లాస్ ఎయిర్‌షో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓ భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా సయ్యద్ 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని నెలరోజుల క్రితమే సంకేతాలు ఇచ్చారు. 2024లో వైట్‌హౌస్ రేసులో మాజీ అధ్యక్షుడు దూకాలని భావిస్తున్నందున వచ్చే వారం తాను చాలా పెద్ద ప్రకటన చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు.