ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసి, భారీ మార్పులు తీసుకొస్తూ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ కుబేర వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా రాజకీయాలపై దృష్టి సారించారు. మొట్టమొదటి సారిగా రాజకీయాలకు సంబంధించిన ట్వీట్ చేశారు.
USA Shooting Incident: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన సంభవించింది. ఫిలడెల్ఫియాలోని ఒక బార్ వెలుపల ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో పలువురి షూటర్ల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. నల్లటి కారులో వచ్చిన వ్యక్తి నడిరోడ్డుపై ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం.
తల్లి అయిన నాయనమ్మ అంటే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే సరోగసీ పుణ్యమా అని ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చిన సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది.
US President Joe Biden condoles loss of lives at Morbi bridge collapse: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో 141 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు మరణించడం అందర్ని కలిచివేస్తోంది. దీపావళి సెలువులు కావడం, వారాంతం కావడంతో మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వచ్చిన చాలా మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్ఫ్రాన్సిస్కో నగరంలోని ఇంట్లో ఉన్న ఆమె భర్త పాల్ పెలోసీ(82)పై దాడి చేసి గాయపరిచాడు.
అమెరికాలో న్యూయార్క్‌లోని స్టేటన్ ఐల్యాండ్‌లో జరిగిన మిస్ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి.
యూకే నూతన ప్రధానిగా నియమితులైన రిషి సునాక్‌కు ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం శుభాకాంక్షలు చెప్పకుండా దూరంగా ఉన్నారు.