ఆపదలో ఉన్న వారిని కాపాడే వాహనానికి ఆపద వచ్చింది. ప్రమాదవశాత్తు 108 వాహనం అగ్ని ప్రమాదానికి గురయి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం రజాసాహెబ్ పేట గ్రామంలో చోటుచేసుకుంది.
Swiggy Ambulance: తెలంగాణలో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పై నుండి పడి మరణించాడు. నాలుగు రోజుల క్రితం డెలివరీ కోసం వెళ్లి, కుక్క నుండి తప్పించుకునే సమయంలో భవనం మొదటి అంతస్తు నుండి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
Ambulance Incident : పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో గురువారం ఒక షాకింగ్ చిత్రం వెలువడింది. అంబులెన్స్ డ్రైవర్ ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో విస్తుపోయిన కొడుకు తన తల్లి మృతదేహాన్ని తన భుజంపై మోసుకెళ్లిన సంఘటన జరిగింది.
ఢిల్లీలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం తన భారత్ జోడో యాత్రను అపోలో ఆసుపత్రి సమీపంలో నిలిపివేశారు. అంబులెన్స్‌ని వెళ్లనివ్వడానికి కాసేపు ఆగాడు. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని తోటి యాత్రికులను కూడా కోరాడు.
Delhi Building Collapse: ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్‌లో 4అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
PM Convoy: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయన వెళ్తున్న మార్గంలో అంబులెన్స్ ను దారి ఇవ్వడం కోసం తన కాన్వాయిని కాసేపు నిలివేశారు.
నాలుగేళ్ల బాలుడు అంటే.. ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటాడు.. మారం చేస్తాడు.. అడిగింది తెచ్చి ఇవ్వాల్సిందే.. ఇలా ఇంట్లో సందడి చేస్తుంటాడు.. ఆ వయస్సులు వారి ఏమి చేసినా.. చూసేవారికి ముచ్చటగా అనిపిస్తోంది.. అయితే, ఇప్పుడు నాలుగేళ్ల లోపే బడిబాట పడుతున్నారు.. అది వేరే విషయం.. అయితే, ఓ బుడతడు.. తన తల్లి ప్రాణాలు పోకుండా కాపాడాడు.. తన తల్లి స్పృహతప్పి పడిపోతే.. ఆందోళన చెందకుండా.. సమయ స్ఫూర్తితో వ్యవహరించాడు.. ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేశాడు.. తన…
అగ్నిపథ్ ఆందోళనలకు మరో ప్రాణం బలైంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. సకాలంలో వైద్యం అందక పోవడంతో అతను తుదిశ్వాస విడిచాడు. చికిత్స కోసం విశాఖకు వస్తుండగా అగ్నిపథ్ ఆందోళనల కారణంగా రైలు నిలిపివేయడంతో తీవ్ర అస్వస్థతతో మరణించాడు. ఈ ఘటన ఏపీలో జరిగింది. కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ కొత్తవలసలో నిలిపివేశారు. చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్ బెహరా(70) మృతిచెందాడు. అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలో నిలిపివేశారు. సమయానికి…
ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ దివ్యాంగ బాలుడు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు. బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహు కోసం ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపాలో నిర్వహించిన ఆపరేషన్ పూర్తయ్యింది. దాదాపు 104 గంటల పాటు శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్‌లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.…