PM Convoy: కాన్వాయ్ ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Convoy: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయన వెళ్తున్న మార్గంలో అంబులెన్స్ ను దారి ఇవ్వడం కోసం తన కాన్వాయిని కాసేపు నిలివేశారు. మోదీ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ తన కాన్వాయ్‌ను దాటిన తర్వాతే మోదీ తన కాన్వాయ్‌ను ముందుకు కదిలించారు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ బీజేపీ మీడియా విభాగం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్-గాంధీనగర్ మార్గంలో ప్రధాని కాన్వాయ్‌లోని ఎస్‌యూవీలు నెమ్మదిగా ఎడమవైపునకు వెళ్లి అంబులెన్స్‌కు దారి ఇస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ తొలి దశతో పాటు గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ రోజు సాయంత్రం బనస్కాంత జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే, అక్కడ ప్రముఖ అంబాజీ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు.
Also Read
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ హైస్పీడ్ రైలును మోదీ ప్రారంభించారు. అనంతరం కాసేపు అందులో ప్రధాని ప్రయాణించారు. రైలులో ఏర్పాట్లను పరిశీలించారు. ఇక, ఈ రైలు అక్టోబరు 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు నడవనుంది. ఈ మార్గంలో టికెట్ కనిష్ఠ ధర రూ.1385, గరిష్ఠ ధర రూ. 2505గా ఉంది. కాగా.. దేశంలో ఇది మూడో వందే భారత్ రైలు. 2019లో తొలి వందే భారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీ – వారణాసి మార్గంలో హైస్పీడ్ రైలు ప్రారంభించగా.. న్యూఢిల్లీ – శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!