Swiggy Ambulance: ఇక అందుబాటులోకి స్విగ్గీ అంబులెన్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swiggy Ambulance: తెలంగాణలో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పై నుండి పడి మరణించాడు. నాలుగు రోజుల క్రితం డెలివరీ కోసం వెళ్లి, కుక్క నుండి తప్పించుకునే సమయంలో భవనం మొదటి అంతస్తు నుండి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో స్విగ్గీ యాజమాన్యం స్పందించింది. తన యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, వారిపై ఆధారపడిన వారి కుటుంబీకుల కోసం అన్ని రకాల అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఉచిత అంబులెన్స్ సేవను ప్రకటించింది. దీని కోసం ఫుడ్‌టెక్ దిగ్గజం Dial4242 అంబులెన్స్ సేవలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్విగ్గీ తన యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లందరికీ, వారిపై ఆధారపడిన వారికి (భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు) ఈ సేవ ఉచితంగా అందజేస్తుంది. ప్రమాదంలో ఉన్న వారు స్విగ్గీ డెలివరీ ఏజెంట్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా యాప్‌లోని SOS బటన్‌ను నొక్కడం ద్వారా సేవలను ఉపయోగించవచ్చు.
Read Also: BJP : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. @టార్గెట్ 2024
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
కేసు తీవ్రత ఆధారంగా BLS (బేసిక్ లైఫ్ సపోర్ట్), కార్డియాక్, ALS (అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్), ఇంటర్-స్టేట్, కోవిడ్-19 అంబులెన్స్‌లు, హియర్స్ వ్యాన్‌లతో సహా వివిధ అంబులెన్స్‌లను పంపనున్నట్లు Swiggy ప్రకటించింది. తెలంగాణలో జరిగినట్లుగానే.. కొత్త సంవత్సరం సందర్భంగా నోయిడాలో Swiggy డెలివరీ ఏజెంట్ అయిన కౌశల్ కారు ప్రమాదంలో చనిపోయాడు. కారు ఢీకొన్న తర్వాత కౌశల్ ను సుమారు కి.మీ దూరం లాక్కుపోయింది. అనంతరం మృతుడి కుటుంబీకులు నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబులెన్స్ సేవ గురించి CEO శ్రీహర్ష మెజెటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం 500 పైగా నగరాల్లో స్విగ్గీ తన సేవలను కొనసాగిస్తోందన్నారు. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన 12నిమిషాల్లో అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో డెలివరీలను సురక్షితంగా చేయడానికి ఆన్-డిమాండ్, వేగవంతమైన, ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించామన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!