Delhi Building Collapse: ఢిల్లీలో సోమవారం ఉదయం పుేరాతన భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రీ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు,అగ్ని మాపక విభాగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.‘ఘటన జరిగినట్లు ఉదయం 8:45 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్నాం. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. లక్కీగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఘటనపై ఎంసీడీ, డీడీఎంఏ అధికారులు విచారణ చేపట్టారు’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | A four-storey building collapsed in North Delhi's Shastri Nagar. There was no loss of life as the house was already empty. As soon as the information was received, vehicles of Delhi Police, Fire and Ambulance reached the spot.
(Video Source: Local, confirmed by Police) pic.twitter.com/WLTdt8lvl8
— ANI (@ANI) December 5, 2022