ఓ వైపు దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని గొప్పలు చెప్పుకుంటున్నా.. మరోవైపు, కొన్ని ఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నాం, వైద్యంలో మన పరిస్థితి ఏంటి? కనీస అవసరాల కల్పనలో మనం ఎక్కడున్నాం..? సాటివారిపట్ల మానవత్వం కూడా చూపించలేకపోతున్నామా? లాంటి విషయాలను తేటతెల్ల చేస్తుంటాయి.. తాజాగా, తన నాలుగేళ్ల కుమారుడి శవాన్ని ఓ తండ్రి.. తన భుజాలపైనే మోసుకుంటూ ఇంటికి చేరుకున్న దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు…
అధికారం అంటే హంగు, ఆర్భాటం మాత్రమే కాదు. పదిమందికి సాయం చేయడం. ప్రమాదానికి గురైనవారికి తమవంతు సాయం చేసి ఆస్పత్రికి తరలించడం. గతంలో తమ అధినేత జగన్ చూపిన మానవత్వాన్ని ఆయన మంత్రులు కూడా చేసి చూపించారు. తన కాన్వాయ్ వెళుతుండగా అంబులెన్స్ రావడం గమనించిన సీఎం జగన్ ఆ అంబులెన్స్ దారి ఇచ్చి.. అందులో వున్న రోగుల్ని కాపాడారు. అదే బాటలో నడిచారు. కొత్తగా మంత్రులైన ఇద్దరు నేతలు. వారెవరో కాదు డిప్యూటీ సీఎం బూడి…
ఏపీ సీఎం జగన్ తన పర్యటనలో ఎప్పుడూ అంబులెన్స్ లను దాటి పోలేదు. తాను ఎంత బిజీగా వున్నా. తన కాన్వాయ్ వెళుతున్న మార్గంలో అంబులెన్స్ సైరన్ వినిపిస్తే పక్కకి ఆపి దారిచ్చేవారు. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్. 108 అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ని పక్కకి జరిపిన సీఎం జగన్. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి వెళుతుండగా ఎనికేపాడు వద్ద ఘటన జరిగింది. రోడ్డుమీద 108 అంబులెన్స్ ను చూడగానే…
కోఠి డీఎంఏ కార్యాలయంలో రూ. 1.41 కోట్ల విలువైన నాలుగు అంబులెన్సు వాహనాలను ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఇలాంటి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. నాలుగు అంబులెన్సుల వాహనాల్లో లైఫ్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇవి బోధన్ ఆస్పత్రిలో ఈ వాహనాలను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం 108,104 ద్వారా అంబులెన్స్ సేవలను అందిస్తుందని తెలిపారు. వీటిలో పాడైపోయిన వాటి స్థానంలో…
మానవత్వాన్ని చాటుకున్నారు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్. తన కాన్వాయ్‌ను ఆపి మరీ అంబులెన్స్‌కు దారిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌పై ప్రశంసలజల్లు కురుస్తోంది. చెన్నైలో తన కాన్వాయ్ వెళ్తుండగా అంబులెన్స్ సైరన్ వినిపించింది. దీంతో వెంటనే తన కాన్వాయ్ ఆపేసి అంబులెన్స్ వెళ్ళిపోనిచ్చారు. ఈవిధంగా స్టాలిన్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. చెన్నైలో నేటి నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యాయి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బడులు తెరిచారు. ఇవాళ ఉదయం సీఎం స్టాలిన్…
విశాఖ మన్యంలో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సామాన్య గిరిజనులు. ఇక గర్భిణీల బాధలు అన్నీ ఇన్నీ కావు. పురిటి నొప్పులతో నిండు గర్భవతి పాపకు జన్మనిచ్చి తిరిగిరాని లోకాలకు చేరింది. ఆ గిరిజన మహిళ మృతి చెందడంతో ఆ చిన్నారితో మరో ముగ్గురు పిల్లలు తల్లిలేని వారయ్యారు. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన రహదారి లేని కారణంతో అది రాలేదు. దీంతో ఆ గర్భిణీ నరకయాతన అనుభవించింది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం…
సంగా రెడ్డిలో రెండు ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, త్వరలో మరొక 13 అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… తల్లితండ్రులు జ్ఞాపకార్థము పేద ప్రజలకోసం రెండు ఉచిత అంబులెన్సులను ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మరో 13 అంబులెన్స్ లు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రాజకీయం కోసం కాదు చాలా రోజుల నుండి తల్లితండ్రుల పేరు మీద సర్వీస్ చేయాలని ఆలోచనతో చేస్తున్నాను. పేద…
ఏపీ తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్‌లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు.…
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల విషయంలో నిబంధనలు మరింత కఠినం చేసింది. తెలంగాణ బోర్డర్ లో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపివేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల గురించి ఆలోచించడం సహజమే. హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం సాంకేతికంగా గైడ్ లైన్స్ పెట్టింది. ఆ గైడ్ లైన్స్ ను పాటించడం కష్టం అని అన్నారు. అంబులెన్స్ ను…
తెలంగాణలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి లాక్‌డౌన్‌ను విధించింది. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డర్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను హైదరాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. దీంతో చెక్ పోస్టుల…