అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఈ మధ్య వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా అంబులెన్స్‌లో ఓ యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి సలహాతో అన్నంలో విషం పెట్టి భర్తను చంపేసిన భార్య
బీహార్‌లోని బోధ్‌గయ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జూలై 24న బీఎంపీ-3 పరేడ్ గ్రౌండ్‌లో హోంగార్డు నియామకాలు జరిగాయి.. రేసులో పాల్గొన్న ఒక యువతి స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే ఇదే అదునుగా భావించిన అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన ఘోరాన్ని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Anitha: ఓ మహిళ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడకూడదు.. రోజాపై హోంమంత్రి ఫైర్
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఆనంద్ కుమార్ ప్రకారం. మహిళా అభ్యర్థి అత్యాచారం గురించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌లను రెండు గంటల్లోనే అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసును నిర్వహించడానికి బోధ్ గయ SDPO సౌరభ్ జైస్వాల్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పంపినట్లు చెప్పారు. అలాగే ఆ ప్రాంతంలోని సీసీటివి ఫుటేజ్ నిందితులను గుర్తించడంలో సహాయపడిందని చెప్పారు. బోధ్ గయ పోలీస్ స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరగా దర్యాప్తు పూర్తవుతుందని.. చార్జిషీట్ కూడా దాఖలు చేస్తామని, నిందితులపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆనంద్ కుమార్ తెలిపారు.