కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్‌లో అంబులెన్స్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు త్రిసూర్‌లోని ఇరింజలకుడాకు చెందిన శివకుమార్ (54), అతని కుమారులు శరత్ (23), సౌరవ్ (15)గా గుర్తించారు. కాసర్‌గోడ్ నుంచి మంగళూరు వెళ్తుండగా అంబులెన్స్.. కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం మంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Duck Outs: క్రికెట్లో ఎన్ని రకాల ‘డక్ ఔట్స్’ ఉన్నాయో తెలుసా.. వివరాలు ఇలా..
మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాసర్‌గోడ్‌లోని మంజేశ్వర్‌లోని తాళ్లపాడు చెక్‌పోస్టు సమీపంలో రోగితో వేగంగా వెళ్తున్న అంబులెన్స్.. టాటా నానో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..
శివకుమార్ దుబాయ్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు. తన అత్త ఆరోగ్యం బాగోలేకపోవడంతో చూసేందుకు కుటుంబ సభ్యులతో బెంగళూరుకు వెళ్తున్నారు. ఇంతలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Israel-Hamas War: రఫాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ దళాలు.. హమాస్ చివరి కోటను బద్ధలు కొట్టడమే లక్ష్యం..