Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒకరిమీద ఒకరు మాటల యుద్దాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసీపీ నేతలు జనసేన మీద .. పవన్ కళ్యాణ్.. వైసీపీ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకోపక్క జనసేనానిపై నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు.
Ambati Rambabu Sensational comments on Pawan kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తాజాగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎదుర్కోవటం మాకు పెద్ద సమస్య కాదని అన్నారు. ఇక పవన్ గురించి ప్రస్తావిస్తూ మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ దత్తపుత్రుడు పవన్ అని అన్నారు. ఇక వారాహి ఎక్కి తిరిగి పిచ్చి కూతలు కూస్తే సరిపోతుందా?…
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫార్ డ్యాం, గైడ్ బండ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు.