అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సుమారు ఐదు నిమిషాల పాటు అమరావతి విధ్వంసంపై వీడియో రిలీజ్ చేశారు. కాగా.. వీడియో ప్లే అవుతున్నప్పుడు సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విధ్వంసం జరిగిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపారు. ఎంతో ఆలోచించి ప్రణాళికలు వేస్తే.. సర్వ నాశనం చేశారని ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారు అమరావతినే రాజధానిగా అంగీకరిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కరుడు గట్టిన తీవ్రవాది కూడా అమరావతికే ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని అందరూ చెబుతున్నారని.. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని చంద్రబాబు తెలిపారు.
ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 3వ బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యుత్ వ్యవస్థ మీద చాలా పట్టు ఉందని, ఆయన ఈ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు.
అమరావతి మాస్టర్ ప్లాన్పై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్తోనే ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై పూర్తిగా స్టడీ చేసి ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని.. ఆ దిశగా నివేదిక రెడీ చేసి ప్రజల అభిప్రాయంతో నిర్మాణం చేపడతామన్నారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు.
రేపు ( గురువారం) రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు అని మంత్రి నారాయణ తెలిపారు. కూల్చేసిన ప్రజావేదిక దగ్గర నుంచి పర్యటన ప్రారంభమవుతుందన్నారు.