CM Chandrababu: రాజధాని పునర్ నిర్మాణం చేసి తీరాల్సిందే.. చంద్రబాబు భావోద్వేగం
- అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల
- ఐదు నిమిషాల పాటు అమరావతి విధ్వంసంపై వీడియో రిలీజ్
- వీడియో ప్లే అవుతున్నప్పుడు సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురి
- అమరావతి విధ్వంసం జరిగిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సుమారు ఐదు నిమిషాల పాటు అమరావతి విధ్వంసంపై వీడియో రిలీజ్ చేశారు. కాగా.. వీడియో ప్లే అవుతున్నప్పుడు సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విధ్వంసం జరిగిన తీరు చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపారు. ఎంతో ఆలోచించి ప్రణాళికలు వేస్తే.. సర్వ నాశనం చేశారని ఆరోపించారు. సింగపూర్ దేశాన్ని మళ్లీ అప్రోచ్ కావాలి.. రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహకరిస్తుందా..? లేదా..? అనేది చూడాలన్నారు. పెట్టుబడులు ఎంత వరకు వస్తాయో తెలీదు..?. తన ట్రాక్ రికార్డు చూసి వచ్చినా.. ఏపీకి వస్తే ఏమవుతుందోననే ఆందోళన పెట్టుబడిదారుల్లో కన్పిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం తప్పు చేశారు.. జగన్ పాలన ఏపీకి శాపంగా మారిందని దుయ్యబట్టారు.
Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటపై రష్యా అధినేత పుతిన్ సంతాపం..
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండేందుకు అర్హత ఉందా..? అని ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు తెలిపారు. ఐదేళ్ల పాటు రాజధానిలో నిర్మాణాలు నిలిపేశారు.. రోడ్లను తవ్వుకుని వెళ్లిపోయారని అన్నారు. ఐదేళ్ల పాటు ఇలా వదిలేస్తే.. ఐరన్ ఎంత వరకు పనికి వస్తుందోననేది చూడాలన్నారు. 2019లో అమరావతి నిర్మాణాలు ఎక్కడి వరకు ఉన్నాయో.. అక్కడితోనే ఆపేశారని పేర్కొన్నారు. రాజధానికి జరిగిన నష్టం ఎంత అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఒక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులోనే రూ. 169 కోట్లు నష్టం వచ్చిందని అన్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూనే, కొత్త ఆలోచనలు.. ప్రతిపాదనలు వస్తే వాటినీ పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు. రూ. 50 వేల కోట్లు ఖర్చు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలని భావించాం.. తక్కువ కాలంలోనే రూ. 30 వేల కోట్లు తిరిగి వచ్చేవన్నారు. ప్రతి రంగంలోనూ టాప్-10 సంస్థలను అమరావతికి రప్పించాలని భావించాం.. త్వరలోనే పునర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.. దానికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చంద్రబాబు చెప్పారు.
Immunity Boost Drinks : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలా.. వీటిని తాగాల్సిందే..
రాజధాని పునర్ నిర్మాణం చేసి తీరాల్సిందేనని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం చేపట్టాలనే కూటమికి ప్రజలు ఓటేశారని తెలిపారు. జగన్‌ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు.. ఇబ్బందులు ఉంటాయి.. కానీ పునర్ నిర్మాణం చేసి తీరాల్సిందేనని చెప్పారు. నాలుగో సారి సీఎం అయ్యాను.. ప్రతిసారి ఛాలెంజ్ గా తీసుకుని పని చేశాను.. ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదుర్కొలేదన్నారు. అధికారులు సహా అందరి ఆలోచనా విధానం మారిపోయింది.. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. చెత్త వేసే వాళ్లే తప్ప.. చెత్త తీసే వాళ్లు లేని పరిస్థితికి ఏపీని తెచ్చారని చంద్రబాబు తెలిపారు.
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!