Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రానికి చేరుకున్నారు.. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు పవన్ కల్యాణ్.. అయితే, ఆయనతో పాటు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మరియు కమెడియన్లు నర్ర శ్రీనివాస్.. నాగ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు పవన్ కల్యాణ్..
Read Also: Ponnam Prabhakar: ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా.. బీజేపీ, బీఆర్ఎస్ లపై పొన్నం ఫైర్
కాగా, అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు.. అక్కడి నుంచి ఈ రోజు గన్నవరం వచ్చారు.. అయితే, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పవన్ కల్యాణ్‌కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. ఆయనతో త్రివిక్రమ్ కనిపించడం ఇదే మొదటిసారి అంటున్నారు.. మరోవైపు పవన్ వెంట ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఎందుకు? వచ్చారు అనేదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.. ఆనంద్ సాయితో ఏదై కొత్త డిజైన్లు గీయిస్తారా? పిఠాపురంలో భూమి కొనుగోలు చేసినట్టు ప్రకటించిన పవన్.. అక్కడ నిర్మాణాల కోసం ఏమైనా ప్లాన్ గీయిస్తున్నారా? ఇంకేదైనా కారణం ఉందా? అనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. అమరావతిలో నిర్మాణలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించిన విషయం విదితమే.