CM Chandrababu: రాజధాని పునర్నిర్మాణంపై సీఎం ఫోకస్.. నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో భేటీ
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం వైపు వేగంగా అడుగులు
- అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ సచివాలయంలో సమావేశం అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- పాల్గొన్న మంత్రి నారాయణ.. నిర్మాణ కంపెనీల ప్రతినిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ రంగ కంపెనీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నిర్మాణ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.. గతంలో ఉన్న టెండర్ల కాలపరిమితి ముగియడంతో ఆయా కంపెనీలతో మళ్లీ చర్చలు జరుపుతోంది కూటమి ప్రభుత్వం.. మధ్యలో నిలిచిపోయిన పనులు కొనసాగించే అంశంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగుతోంది..
Read Also: CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కాగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనలపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు.. మొదట పోలవరం.. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించారు.. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని పేర్కొన్నారు. అమరావతి రైతులు 1631 రోజులు ఆందోళన చేపట్టారని, రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులదన్నారు. అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్‌డీఏ కార్యాలయం సీఎం చంద్రబాబు మాట్లాడారు.. అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమని కొనియాడారు. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించిందన్నారు. ఏపీ అనగా ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అంటూ చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెట్టామని, అలాంటి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందన్నారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని, ఈ రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని విమర్శించారు. విభజిత ఏపీ, ఉమ్మడి ఏపీలో ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదన్నారు. ఇక, అమరావతి ప్రజా రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలును మోడల్ సిటీగా మారుస్తామన్నారు. రాయలసీమ సహా ఏపీలో 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పామని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు గతంలోనే రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!