గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ( ANU) దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మూడు ( విశాఖ, కర్నూలు, అమరావతి ) రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. అమరావతి- ఎల్లుండి కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. చంద్రబాబుతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై చర్చ. మొత్తం మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేస్తారా..? లేక తొలి విడతలో పరిమిత సంఖ్యతో సరిపెడతారా..? అని తర్జన భర్జన. చంద్రబాబుతో పాటు డెప్యూటీ సీఎంగా పవన్, మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం ఖాయమంటోన్న టీడీపీ – జనసేన వర్గాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పాటు బీజేపీ ప్రతినిధి మంత్రిగా ప్రమాణ…
Amaravati: ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే అమరావతికి పూర్వ వైభవం వస్తోంది. గత ప్రభుత్వం విశాఖ రాజధానిగా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టిన ప్రజలు వాటిని తిరస్కరించారు. అమరావతి వైపే అందరు మొగ్గు చూపారు ఎన్నికల్లో గెలుస్తే అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. రాష్ట్ర యువతకు ఉపాధి కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన ఆ మాట మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి ప్రాంతంలో…
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. అమరావతిలో సీఆర్డీఏ అధికారులు కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ నెల 12న చంద్రబాబు నాయుడు అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తన అధికారుల బృందాన్ని, కలెక్టర్లను ఎంపిక చేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. . ఇప్పటికే ఆరోపణలు ఎదురుకుంటున్న జవహర్ రెడ్డి (సీఎస్) తో పాటు కొందరు అధికారులకు బదిలీలు జారీచేశారు కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్‌కుమార్ ఎంపిక జరిగింది ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించారు. మరిన్ని వివరాలు…
రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ రాశారు.