హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నారు..
సెప్టెంబర్ నుంచి అమరావతి పనులు క్లియర్ గా కనిపిస్తాయన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల పనులు త్వరలో జరగబోతున్నాయన్నారు.. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారన్న ఆయన.. రెండు మూడు సంవత్సరాల్లో మంచి నగరాన్ని చూస్తారని తెలిపారు.. చిన్న సమస్యలను ఉంటే వాటిని మేం పరిష్కరిస్తాం.. ఏ రాష్టానికి లేని సంస్థలు, ఉద్యోగాలు ఏపీకి మూడు, నాలుగు సంవత్సరాల్లో రాబోతున్నాయి..
AP Capital Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం నిధులు సమీకరించుకునే పనిలో సీఆర్డీఏ పడింది. ఏడీబీతో కుదుర్చుకున్న రుణ ఒప్పందం మేరకు వచ్చే నాలుగేళ్లలో అమరావతి రాజధాని నగరంలో భూ విక్రయానికి ప్రణాళిక రచిస్తుంది.
రాజధాని అమరావతి అభివృద్ది చెందాలన్నదే బీజేపీ అభిమతం అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.. గత ప్రభుత్వం అమరావతి రైతులను దగా చేసిందని విమర్శించారు... ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అమరావతి రైతులకు బీజేపీపై ఉన్న అపోహను రాజధాని జేఏసీ నేతల సమావేశంలో తీర్చేశామన్నారు.
సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున థాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది అంటూ ఆ దేశ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటించడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియా వేదికగా.. వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు.
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి.. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ.. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు టాన్సీ లెంగ్.. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు.. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు.. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ ,…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రికి హైదరాబాద్ నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు.. పరిశ్రమలకు సంబంధించి సింగపూర్ లో సీఎం చంద్రబాబు పర్యటన జరగనుంది.