Amaravati Iconic Bridge: అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక..
- అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక..
- హైదరాబాద్-అమరావతి మధ్య తగ్గనున్న 35 కిలోమీటర్ల దూరం..
- అమరావతిని అనుసంధానం చేస్తూ ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మణం..
- ఐకానిక్ వంతెన డిజైన్‌ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Iconic Bridge: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఐకానిక్ వంతెన నమూనా ఫైనల్ అయింది. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ – అమరావతి మధ్య దూరం సుమారు 35 కిలో మీటర్ల తగ్గనుంది. ఇక, అమరావతిని అనుసంధానించే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల అభిప్రాయ తీసుకున్నారు. అందులో రెండో ఆప్షన్‌కు దాదాపుగా 14 వేల ఓట్లు రావడంతో అదే నమూనా ఎంపికైంది.
Read Also: Uttar Pradesh: అన్నయ్య మరణం తట్టుకోలేక.. చెల్లి ఏం చేసిందంటే…
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అయితే, ఇప్పటికే ఈ నమూనాకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. అమరావతిలోని ఎన్–19 రోడ్డును ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్ రహదారి)తో అనుసంధానం చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. రూ.2,500 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లను ఏపీ ప్రభుత్వం పిలవనుంది. కాగా, ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో రూపుదిద్దుకునే ఈ ఐకాన్ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలో మీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు.
Read Also: TheyCallHimOG Bookings : ‘OG’ నైజాం బుకింగ్స్ ఓపెన్ చేసేందుకు డేట్ ఫిక్స్..
ఇక, ప్రస్తుతం ఎన్‌హెచ్–65 నుంచి అమరావతికి చేరుకోవాలంటే మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజ్ మీదుగా 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఐకానిక్ వంతెన పూర్తైతే మూలపాడు నుంచి కేవలం 5 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది. ఈ వంతెన నిర్మాణంతో సుమారు 35 కిలో మీటర్ల దూరం తగ్గి, గంటన్నర సమయం ఆదా కానుందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?