CRDA Headquarters: రేపు సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఉదయం 9.54 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆఫీసును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మొత్తం ప్రాజెక్టు 24,059.53 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు అంతస్తులు నిర్మించారు.
Read Also: Medchal : మెడ్చల్‌లో నిర్లక్ష్యానికి పరాకాష్ట..! గందరగోళంగా మారిన పల్స్ పోలియో డ్రైవ్
సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం..
* గ్రౌండ్ ఫ్లోర్: 2,212.26 చదరపు మీటర్లు
* మొదటి అంతస్తు: 2,869.51 చదరపు మీటర్లు
* రెండో అంతస్తు: 2,869.51 చదరపు మీటర్లు
* మూడో అంతస్తు: 2,885.03 చదరపు మీటర్లు
* నాలుగో అంతస్తు: 2,867.56 చదరపు మీటర్లు
* ఐదో అంతస్తు: 2,867.56 చదరపు మీటర్లు
* ఆరో అంతస్తు: 2,981.97 చదరపు మీటర్లు
* ఏడో అంతస్తు: 2,981.97 చదరపు మీటర్లు
ప్రాజెక్టు పరిసర ప్రాంతం:
* గ్రీన్ బెల్ట్: 3,560 చదరపు మీటర్లు
* ఓఎస్‌ఆర్: 3,877.21 చదరపు మీటర్లు
* ఓపెన్ పార్కింగ్: 5,504 చదరపు మీటర్లు
* ఇతర సదుపాయాలు: 1,564.16 చదరపు మీటర్లు