CM Chandrababu: సీఎం చంద్రబాబు చిట్‌చాట్.. మంత్రి లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
- ఈ నెలాఖరు వరకు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ పూర్తి చేస్తాం..
- డిసెంబర్ నుంచి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం..
- పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు..
- పెట్టుబడుల సాధనకు మంత్రి లోకేష్ తీవ్ర కృషి చేస్తున్నారు..
- లోకేష్ ఆదేశాలతో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి ప్రజాదర్బార్ నిర్వహించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌లో పలు కీలక అంశాలపై మాట్లాడారు. పార్టీ వ్యవస్థ బలోపేతం, పెట్టుబడుల సాధన, రెవెన్యూ సమస్యల పరిష్కారం, సాంకేతిక పురోగతి వంటి అంశాలపై వివరించారు. ఈ నెలాఖరులోగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తి చేస్తాం.. డిసెంబర్ నుండి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.. అలాగే, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలపై కసరత్తు కొనసాగుతున్నదని చెప్పారు చంద్రబాబు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఇక, క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది. ఇక షిప్‌మెంట్ మాత్రమే మిగిలింది. నిర్ణయించిన సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. మరోవైపు, పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన నిరంతర కృషి వల్ల రాష్ట్రానికి పాజిటివ్ సిగ్నల్ వస్తోందని ప్రశంసలు కురిపించారు.. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. రెవెన్యూ వ్యవస్థలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టమయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. 22ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
అలాగే, ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్‌లు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేష్ మార్గదర్శకత్వంలో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చింది. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థ ఏర్పాటే మా లక్ష్యంగా పేర్కొన్నారు.. ఇక, ఈ నెల విశాఖలో పెట్టుబడుల సదస్సు జరుగనుంది. సదస్సు “ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాలు” వంటి రూపాల్లో రెండు రోజులు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.. ఈ సదస్సు ద్వారా ప్రజల అవసరాలు, అధునాతన సాంకేతిక అంశాలపై అధ్యయనం జరగనుంది అని వెల్లడించారు.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వీఆర్వోల వరకు బాధ్యతతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ విధానం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అని మీడియా చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..