Amaravati Development: రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి సర్కార్.. అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి అభివృద్ధి కోసం అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను అమరావతి సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. రుణ ఒప్పందం, ఇతర అవసరమైన చర్యలు, పనుల అమలు బాధ్యతలను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగించింది.
Read Also: Delhi Car Blast: వెలుగులోకి మరో వీడియో.. ట్రాఫిక్‌లో ఉండగా ఏం జరిగిందంటే..!
అదే విధంగా, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (NaBFID) ద్వారా రూ.7,500 కోట్ల రుణం పొందేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రుణానికి ప్రభుత్వ హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను అమరావతి నగరంలోని 4, 9, 12 జోన్లలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవన సముదాయం, ల్యాండ్ పూలింగ్ పథకం మరియు మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణ ఒప్పందం, హైపోథెకేషన్ డీడ్, అథారిటీ నిర్ణయాలు, ఇతర అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఏపీసీఆర్‌డీఏ కమిషనర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీలకు అధికారాలు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ జారీ చేశారు.