Chandrababu: ‘రా.. కదలిరా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ స ఈఎం జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. అందులో భాగంగా నేడు అరకు, అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘రా.. కదలిరా’ సభలు నిర్వహించనున్నారు. అరకు, మండపేటల్లో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ రా.. కదలి రా.. బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ నాయకత్వం.
Read Also: PM Modi : రూ.1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ
ఇక, మండపేటలో రా.. కదలిరా సభలో పాల్గొంటారు చంద్రబాబు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నుండి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు మండపేట చేరుకుంటారు.. మండపేట బైపాస్ రోడ్డులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు గంటన్నర సేపు జరుగనున్న బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.. అనంతరం 5 గంటలకు మండపేట నుండి బయల్దేరి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాజమండ్రి నుండి విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు చంద్రబాబు.
Read Also: Stock Market : రామ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ రోజు స్టాక్ మార్కెట్ కు హాలిడే ?
మరోవైపు నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో పోలీసు ఆంక్షలు విధించారు. సబ్ డివిజన్ పరిధిలో అంతటా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని.. ఫైర్ క్రాకర్స్ కాల్చడo నిషేధమని తెలిపారు అమలాపురం డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్.. మద్యం మత్తులో వాహనాలు నడపరాదు. విచక్షణ రహితంగా, స్పీడ్ గా బైక్, కారు, ఇతర వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి రైడర్స్ పై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ద్విచ్రవాహనాల సైలెన్సర్ లు తీసేసి, విన్యాసాలు చేస్తూ అధిక శబ్దాలు చేసినట్లయితే అటువంటి వాహనాలు స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పటిలాగే అంతా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు అమలాపురం డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్.