Allu Arjun : సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై ఈ రోజు అల్లు అర్జున్‌ను విచారించారు పోలీసులు. అయితే.. అల్లు అర్జున్ పోలీసుల విచారణలో ఘటనకు సంబంధించిన వీడియో చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. మూడు గంటల 35 నిమిషాలు అల్లు అర్జున్ ని పోలీసులు విచారించారు. కొన్ని వాటికి తనకు తెలియదని.. థియేటర్ లోపల చీకటిగా ఉన్ననందున అర్ధం కాలేదు అని సమాధానం చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు ఒప్పుకున్న అల్లు అర్జున్.. మళ్ళీ విచారణ పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని చెప్పినట్లు తెలిపారు పోలీసులు. పూర్తి విచారణను వీడియో రికార్డ్ చేసిన పోలీసులు.. విచారణ సమయంలో అల్లు అర్జున్ టీ, బిస్కట్స్, డ్రై ఫ్రూట్స్ తిన్నట్లు తెలిపారు. విచారణ సమయంలో కేవలం మూడు సార్లు వాటర్ తాగినట్లు.. అల్లు అర్జున్ తను వాహనంలో ఉన్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, తిని టీ తాగినట్లు తెలిపారు.
Sritej Father Bhaskar : అల్లు అర్జున్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది.. కేసు వాపస్ తీసుకుంటా..!