Allu Arjun Live Updates: పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం మరోసారి నోటీసులు ఇచ్చారు. నేడు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇటీవల అరెస్టయిన అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. గత రెండు రోజులుగా వాదోప వాదనలతో ఈ కేసు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయంశంగా మారింది.…
విడుదల తేదీకి ముందురోజే పెద్ద హంగామా చేస్తూ స్పెషల్ షోలు పడతాయి. బెనిఫిట్ షో పేరుతో సినిమాలు ప్రదర్శించి ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెడతారు. నటుల మీద అభిమానులకున్న పిచ్చిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బెనిఫిట్ షో సంస్కృతి పాతదే అయినా.. గతానికీ, ఇప్పటికీ బెనిఫిట్ షోలు పూర్తిగా మారిపోయాయని మాత్రం చెప్పక తప్పదు.
బీజేపీ ఎందుకు...అల్లు అర్జున్‌కు సపోర్టు చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే...ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని అంటున్న కమలం నేతలు...అనుమతి లేకున్నా అయనను ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. తమ లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సమావేశమయ్యారు.
Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను కిమ్స్ వైద్యులు విడుదలచేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నాడని వైద్యులు వెల్లడించారు. శ్రీతేజ్‌కు లిక్విడ్ ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని.. తెల్లరక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారాన్ని అందిస్తున్నట్లు హెల్త్‌బులెటిన్‌లో వైద్యులు వివరించారు. Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మిత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పరామర్శించారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని,సినిమా హీరోల ఇండ్ల పై దాడులు చేయకూడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు..ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. Jr…
చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు! పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న…
CP CV Anand : హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా, “విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయరంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసినది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఏవీ అయినా, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి…