ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు.
ఇక ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటింది. అయినా కూడా ఎక్కడా కూడా కలెక్షన్స్ డ్రాప్ అవకుండా డీసెంట్ గా దూసుకెలుతోంది. వరల్డ్ వైడ్ గా 22 రోజులకు గాను రూ. 1719.5 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏపాటిదో మరోసారి తెలియజేసింది. ఈ కలెక్షన్స్ తో 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2. ఓవర్సీస్ లోను పుష్ప కు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక తెలుగు రాష్టాల్లో బ్రేక్ ఈవెన్ సాదించిన పుష్ప లాభాల బాటలో పయనిస్తోంది. పోటీలో మరే ఇతర స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం, క్రిస్మస్ హాలిడే నాడు హౌస్ ఫుల్స్ తో నడిచింది పుష్ప -2. నేడు, రేపు వీకెండ్ కావడం, న్యూ ఇయర్ కూడా ఇదే సినిమా ఉండడం కలిసొస్చే అంశం. ఇక సంక్రాంతి వరకు పుష్ప కు లైన్ క్లియర్ గా ఉంది. ఆ లోగా చాలా సింపుల్ గా రూ. 2000 కోట్ల మార్క్ ను అవకాశం ఉందని ట్రేడ్ అంచనా