ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆహా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ స్థాపించిన ఈ ఓటిటీ ప్లాట్ ఫార్మ్ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. టాప్ ఓటిటీ ప్లేట్ ఫార్మ్ లలో ఒకటిగా ఆహా నిలబడగలిగింది. ఇక దీనికోసం అల్లు అరవింద్, అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నారు అనేది వాస్తవం. ఇందులో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు.. ఆయన కూడా ఆహా కోసం తనవంతు కృషి చేస్తున్నాడు అని అణ్డరు అనుకుంటున్న తరుణంలో…
అల్లు అరవింద్ – ఈ పేరు వింటే చాలు ముందుగా ఆయన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ‘ఆహా’ ఓటీటీని సక్సెస్ రూటులో సాగేలా చేస్తున్నారు. అందులో భాగంగా ఏ నాడూ టాక్ షో చేయని నటసింహ నందమూరి బాలకృష్ణతో ‘ఆహా’ అనిపించేలా ‘అన్ స్టాపబుల్’ షో చేయిస్తున్నారు. దీనిని బట్టే అల్లు అరవింద్ మేధస్సులోని పవర్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందరో యువనిర్మాతలు అరవింద్ ను ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో సాగుతున్నారు. కొందరు నిర్మాతలకు ఆయనే…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’తో గత యేడాది ఆగస్ట్ లో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు వస్తున్నాయి. రెండో సినిమా విడుదలకు ముందే కిరణ్ ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అవి…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలైంది. డీసెంట్ హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు రావడం విశేషం. Read Also : మళ్ళీ తెరపైకి అనుష్క… జులన్ గోస్వామి బయోపిక్ కు రెడీ !…
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా అద్భుతం సుకుమార్… అల్లు అర్జున్ చాలా రోజులుగా తానేంటో చూపించాలి అనుకుంటున్న విశ్వరూపం, నా కలల ప్రతిరూపం… దేవి మూడవ దశాబ్దంలో మన కర్ణభేరిపై కూర్చుని వాయిస్తున్న ఒక మధుర మృదంగం… రష్మిక గీతా ఆర్ట్స్ లో పుట్టిన ఈ చిన్న సితార మేమంతా గర్వపడేలా చేసిన ఒక ధృవతార… మైత్రి చాలామందికి…
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కొద్దిగా కోలుకొంటోంది. థియేటర్లు కళలాడుతోన్నాయి.. దీంతో వరుస సినిమాలు థియేటర్లకు క్యూ కట్టాయి. ఇక ‘అఖండ’ చిత్రంతో డిసెంబర్ శుభారంభం అయ్యింది.. ఇకపోతే ప్రస్తుతం అఖండ తరువాత అందరి చూపు నెక్స్ట్ సినిమాలపైనే ఉన్నాయి. డిసెంబర్ 17 న పుష్ప సింగిల్ గా వస్తుండగా.. డిసెంబర్ 24 న నాని శ్యామ్ సింగరాయ్, వరుణ్ తేజ్ ‘గని’ ఢీకొట్టబోతున్నాయి. అయితే ఈ రేస్ నుంచి తాజాగా గని…
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎప్పుడూ కొత్తదనం కోసం పరితపిస్తుంటాడు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం అహర్నిశలు స్క్రీప్ట్ ల వేటలో ఉన్నాడు. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉండగానే వాటి రైట్స్ తీసుకుని ఆహాలో స్ట్రీమింగ్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నాడు. అలా ‘లాక్డ్, కుడి ఎడమైతే’ వంటి సినిమాలు ఉన్నాయి. తాజాగా అలా ‘టైమ్ లూప్’ కాన్సెప్ట్ తో తెరకెక్కిన శింబు ‘మానాడు’ సినిమా రీమేక్ రైట్స్ ను అరవింద్ తీసుకున్నారట.…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈక్వెషన్స్ మారిపోయాయి. ఇంతకాలం అక్కినేని, మెగా ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అలానే అల్లు అరవింద్ సైతం అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ తో సినిమాలు నిర్మించి ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో భాగస్వాములు కావడం కూడా వారి బంధాన్ని బలోపేతం చేసింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్…
ఫిలించాంబర్‌లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి చిత్రపరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు తీరనిది. ఎవరూ కూడా భర్తీ చేయలేనిది అన్నారు. సమాజాన్ని మేలుకొలిపే, సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవి. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పాను. నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పాను. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదు. కిమ్స్ హాస్పిటల్…
ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఈ చిత్రంతో బూరె బుగ్గల చిన్నదాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు తెలుగింటి ఆడపడుచులా మార్చేసుకున్నారు. యంగ్ హీరోల సరసన నటిస్తూ అమ్మడు విజయాలను అందుకుంటూ వస్తుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల ఈ బొద్దుగుమ్మ చిక్కిపోయి కనిపించినా తెలుగు ప్రేక్షకులు ఒకే అనేసుకున్నారు. తెలుగే కాకుండా అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుతున్న ఈ ఢిల్లీ బ్యూటీ నేడు తన 31 వ పుట్టినరోజు…