యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలైంది. డీసెంట్ హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు రావడం విశేషం.
Read Also : మళ్ళీ తెరపైకి అనుష్క… జులన్ గోస్వామి బయోపిక్ కు రెడీ !
రెండో సినిమా విడుదలకు ముందే కిరణ్ ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలను అంగీకరించాడు. అవి సెట్స్ మీద ఉండగానే ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించే తొలి చిత్రంలో ఆఫర్ అందుకున్నాడు. అలానే నవంబర్ మాసంలో కిరణ్ అబ్బవరం హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఓ సినిమాను ప్రారంభించింది. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం ఓ మూవీ చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ నంబర్ 7గా నిర్మితం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 7వ తేదీ ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో మొదలు కాబోతోంది. ఇది కిరణ్ అబ్బవరం కూ 7వ చిత్రం కావడం విశేషం. సినిమా పేరుతో సహా పూర్తి వివరాలను రేపు ప్రకటించనున్నారు.