హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా అద్భుతం సుకుమార్… అల్లు అర్జున్ చాలా రోజులుగా తానేంటో చూపించాలి అనుకుంటున్న విశ్వరూపం, నా కలల ప్రతిరూపం… దేవి మూడవ దశాబ్దంలో మన కర్ణభేరిపై కూర్చుని వాయిస్తున్న ఒక మధుర మృదంగం… రష్మిక గీతా ఆర్ట్స్ లో పుట్టిన ఈ చిన్న సితార మేమంతా గర్వపడేలా చేసిన ఒక ధృవతార… మైత్రి చాలామందికి ఇష్టం… నొప్పించక తానొవ్వక పరిగెత్తడం చాలా కష్టం… కానీ త్వరలో వీరు ప్రథమ స్థానానికి చేరడం స్పష్టం… ఇలా సునీల్ మిగతా అందరి గురించి మాట్లాడి స్టేజ్ దిగిపోవాలని అనుకున్నాను. కానీ బన్నీ ఫ్యాన్స్… అవర్ మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్… మీకందరికీ బిగ్గెస్ట్ ఫీస్ట్… మీకందరికీ సినిమాను థియేటర్లో చూసే సమయం ఆసన్నమైందని నిరూపితం అయ్యింది కాబట్టి థియేటర్లో కలుకుందాం” అంటూ ముగించారు.