మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం హిందూ పక్షానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
READ MORE: Hyderabad: నేడు ఘనంగా అల్లూరి జయంతి.. ముఖ్య అతిథిగా రాజ్‌నాథ్‌సింగ్.. లైవ్ మీ కోసం..
శ్రీ కృష్ణుడి జన్మస్థలంలో ఉన్న చాలా పురాతనమైన ఆలయాన్ని కూల్చివేసి ఈద్గా నిర్మించారని హిందూ పక్ష న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఉన్న వాస్తవాలు, పిటిషన్ ఆధారంగా, మధురలోని షాహి ఈద్గాను ప్రస్తుతం వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ కేసుపై హిందూవుల తరఫు న్యాయవాది మహేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. మధురలోని షాహి ఇద్గా మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మార్చి 5, 2025న హైకోర్టులో దరఖాస్తు దాఖలైందని చెప్పారు. దీనిపై మే 23న కోర్టులో చర్చ పూర్తయిందని.. కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేయగా.. నేడు తీర్పు వెలువరించిందని వెల్లడించారు..
READ MORE: Tamil Nadu: సీఎం అభ్యర్థిగా స్టార్ హీరో విజయ్.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ..
హిందూ సంఘాల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం మజీద్ ఉన్న ప్రదేశంలో ఆలయం ఉండేది. ఇప్పటి వరకు.. మసీదు ఉనికికి సంబంధించిన ఎటువంటి ఆధారాలను సమర్పించలేకపోయారు. అటువంటి పరిస్థితిలో దానిని మజీద్ కాకుండా.. వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలి. అయోధ్య కేసులో కోర్టు తన నిర్ణయం ఇచ్చే ముందు బాబ్రీ మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించినట్లే.. ఈ షాహి ఇద్గా మసీదును కూడా వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.