ఆ నియోజకవర్గంలో డబ్బుకు తప్ప పార్టీ లాయల్టీకి విలువలేదా? ఆ చర్చే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇరకాటంగా మారిందా? దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఆవేదనతో రాజీనామా చేయడం శాసనసభ్యురాలికి ఇబ్బంది కాబోతోందా? టీడీపీకి రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకా ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం… హాట్ హాట్ పాలిటిక్స్‌కు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల దాడులు,…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. శ్రీ కీర్తన స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రాకను తల్లి చూస్తుండగానే ఆమె కళ్ల ముందే బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. శ్రీ కీర్తన హైస్కూల్ లో చిన్నారి హరి ప్రియ యూకేజీ చదువుతోంది. స్కూల్ ముగిసిన అనంతరం బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర్ల సహాయంతో దొర్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.
భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. మాకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి అని సూచించారు.. లేకపోతే అసలు పని చేయని వాళ్లకి పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు అని హితవుచెప్పారు..
మన దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేతృత్వంలో తిరంగా ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా పాకిస్తాన్ యుద్ధంలో అమరవీరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్‌కు అఖిల ప్రియ నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు తిరంగా ర్యాలీ పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నానని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ తన…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్‌గా ఉండేవి. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన, పూర్తి నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయన్న టాక్ ఉంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై నిత్యం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Allagadda: నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ తీసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న డ్రైవర్..
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓలో ఫిర్యాదు నమోదైంది. అధికార హోదా లేకున్నా.. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్థానంలో సమీక్ష సమావేశానికి ఆళ్లగడ్డ టీడీపీ నేత విఖ్యాత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు బీసీ…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.