చేతిలో చీపురు పట్టుకుని రోడ్ల మీద ఉన్న చెత్త ఊడ్చేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కమిషనర్‌ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్న సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో గత నాలుగు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు.
Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా దొర్నిపాడులో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి హాజరైయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హఠాత్తుగా కార్యక్రమం వద్దకు విచ్చేసారు. ఈ నేపథ్యంలో కేసీ కెనాల్ రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని భూమా అఖిల ప్రియ కలెక్టర్ ను కోరారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి…
Bhuma AkhilaPriya : ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో నష్టపోయిన రైతులను మాజీమంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు.
Off The Record: ఆళ్లగడ్డ. హాట్ హాట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ప్రత్యర్థుల మధ్య ఆళ్లగడ్డ పొలిటికల్ సీన్ రసవత్తరంగా ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం టీడీపీలోనే రాజకీయ సెగలు కనిపిస్తున్నాయి. నువ్వా నేనా అనేట్లు రెండు వర్గాలు కత్తులు దూసుకోవడం కేడర్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ పంచాయితీ పసుపు పార్టీలో శ్రుతిమించే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిన మాజీ మంత్రి భూమా…
CM Jagan: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనకు,…
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రెండో విడత నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10:15 గంటలకు ఆయన ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఉదయం 10:45 గంటల…
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం ఒక్క వెలుగు వెలిగింది. భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత ఆళ్లగడ్డలో ఆ కుటుంబానికి పట్టు సడలింది. భూమా అఖిల నిత్యం ప్రత్యర్థులతోపాటు.. ఒకప్పటి సన్నిహితులతోను, సొంత బంధువులతోను పోరాడాల్సి వస్తోంది. ఒకవైపు కేసులు, మరోవైపు రాజకీయ వివాదాలు, పెదనాన్న కుమారుడు భూమా కిశోర్ రెడ్డితో తగాదాలు… వెరసి జనం సమస్యల కంటే సొంత సమస్యలే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆమె దృష్టంతా వాటిపైనే పెట్టాల్సి…
అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…