Diwali: ‘‘హోలీ’’ వివాదం మరిచిపోక ముందే, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(AMU)లో మరో వివాదం చెలరేగింది. అక్టోబర్ 18న హిందూ విద్యార్థులు క్యాంపస్‌లో ‘‘దీపావళి’’ జరుపుకోవడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నిరాకరించడం వివాదాస్పదమైంది. అక్టోబర్ 17న ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నందున అక్టోబర్ 18 తర్వాత, ఒకటి రెండు రోజులకు వేడుకలు జరుపుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులను కోరింది. దీపావళి జరుపుకోవడంపై ఎలాంటి ఇబ్బంది లేదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చిలో హోలీకి ముందు యూనివర్సిటీలో…
Aligarh Muslim University: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలోని సర్ షా సులైమాన్ హాల్‌లో ఆదివారం భోజనం కోసం ‘బీఫ్ బిర్యానీ’ వడ్డించాలని ఇచ్చిన నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ నోటిసుని ఇద్దరు అధికారిక వ్యక్తులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఆదివారం లంచ్ మెనూ మార్చబడింది. డిమాండ్ మేరకు చికెన్ బిర్యానీ బదులుగా బీఫ్ బిర్యానీ వడ్డించబడుతుంది’’ అని నోటీసుల్లో ఉంది. Read Also: BJP MLA: “ముస్తఫాబాద్”…
MU: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ‘‘అసభ్యకరమై వ్యాఖ్యలు’’ చేసిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(AMU) గెస్ట్ లెక్చరర్‌ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జనవరి 11 రాత్రి అతడికి, ఏఎంయూ భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొనబడింది. ఈ సంఘటనపై ఏఎంయూ అధికారులు సంస్కృత విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అరిమందన్ సింగ్ పాల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Aligarh Muslim University: ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ హోదాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈరోజు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడించింది.
CJI DY Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎల్లుండి పదవి విరమణ చేయనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ కు ఇవాళ సీజేఐగా చివరి వర్కింగ్ డే. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం సుప్రీం కోర్టులో చంద్రచూడ్ రిటైర్మెంట్ ఫంక్షన్ జరగనుంది.
మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒక వ్యక్తి ఏం ధరించాలో నిర్దేశించకూడదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు.
Uttar Pradesh: గత పదేళ్లుగా దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయి. కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంత మంది మళ్లీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసింది.
Aligarh Muslim University: ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ యుద్ధంలో ఇండియాలోని ప్రజలు కూడా ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు పలువరు విద్యార్థులు సోమవారం మార్చ్ నిర్వహించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.