సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూబాయి కథియవాడి’ రూపంలో అలియా భట్ మరో అద్భుత కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించింది. ‘గంగూబాయి’ పాత్రలో అలియా భట్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ సెన్సేషన్ సమంత కూడా తాజాగా ఈ మూవీని చూసి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా ‘మాస్టర్ పీస్’ అంటూ ‘గంగూబాయి కథియవాడి’ టీంపై ప్రశంసలు కురిపించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో “#’గంగూబాయి కథియవాడి’ ఒక కళాఖండం!!…
బాలీవుడ్ లో కంగనా రనౌత్ విమర్శల నుంచి తప్పించుకున్న వారు బహు అరుదు. ఇక వారసులను అయితే కంగనా ఓ ఆట ఆడుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో మార్లు ఆలియా భట్ పై విమర్శల జల్లు కరిపించింది. ఆలియాను వారి కుటుంబసభ్యులతో కలపి ‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్’ అనేసింది కూడా. ఇక ఆలియా నటించిన ‘గంగూబాయి’ సినిమా రిలీజ్‌కు ముందు 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా ఖర్చు అంతా బూడిదలో పోసిన…
పదేళ్ళ క్రితం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అలియాభట్… గడిచిన దశాబ్దంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. అయితే ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. ‘రాజీ’ తర్వాత ఆమె నటించిన అలాంటి మరో సినిమా ‘గంగూబాయి కఠియావాడి’. ముంబైలోని అతి పెద్ద వేశ్యావాటిక కామాటిపురాలోని గంగూబాయి అనే నాయకురాలి జీవితం ఆధారంగా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమా ఇది. అనేక సార్లు…
‘గంగూబాయ్ కథియావాడి’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు వీగిపోయింది. గంగూబాయి పెంపుడు కొడుకునంటూ షా అనే వ్యక్తి చేసిన అభ్యర్థనను సుప్రీమ్ కోర్టు గురువారం తిరస్కరించింది. తన తల్లి గౌరవానికి భంగం కలిగించేలా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయని, దాని విడుదలపై స్టే ఇవ్వాలని, లేదంటే పేరు మార్చాలని కోరిన షా వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. చిత్ర దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తరఫున కోర్టులో లాయర్ ఎ. సుందరమ్…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన కొత్త చిత్రం ‘గంగూబాయి కతియావాడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే అలియా తన సినిమా ప్రీమియర్ షోలకు హాజరయ్యేందుకు బెర్లిన్ వెళ్లింది. ఈ సమయంలో అలియా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు బెర్లిన్ నుండి తిరిగి రావడానికి ముందు అలియా భట్ కొన్ని తాజా పిక్స్ ను షేర్ చేసింది. అందులో బాత్ టబ్ లో కూర్చుని అలియా చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానుల హృదయాలను దోచుకుంటుంది.…
సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల గురించే కాదు వాళ్ళు తీసుకునే భారీ పారితోషికం కూడా హాట్ టాపిక్కే ! అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాకు ఎంత వసూలు చేస్తున్నారనే విషయం గురించి తెలుసుకుందాం. నేషనల్ వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హీరోయిన్లు కొంతమంది కోట్లలో వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే పరిధులు దాటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో నటించడానికి…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి” సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషంగా ఉన్న చిత్రబృందం ఆనందాన్ని ఆవిరి చేస్తూ గంగూబాయి తనయుడు సినిమాపై ఫైర్ అయ్యాడు. గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి…
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా విడుదల కాకముందే అమ్మడు టాలీవుడ్ మీద ఫుల్ ఆసక్తి చూపిస్తోంది, ఎన్టీఆర్ 30 లో అవకాశం వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఇక తాజగా ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మరో స్టార్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక స్టార్ ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత. అలియా నటించిన గంగూభాయ్ కతీయవాడి విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో జరిగిన…
“ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల సమయానికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. పలు వాయిదాల అనంతరం సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సమస్య మేకర్స్ని కలవరపెడుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్లను పరీక్షా సీజన్లుగా పరిగణిస్తారు. అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో ఎక్కువగా విడుదల కావు. అయితే ఈ సంవత్సరం మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా జనవరిలో…