దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామా మార్చ్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి జక్కన్న సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also : Bheemla Nayak Hindi Trailer : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే !
“ఆర్ఆర్ఆర్” భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలవుతోందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా భారీ ఎత్తున విడుదలవుతోంది. సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ యూకే అంతటా దాదాపు 1000 స్క్రీన్లలో విడుదల కానుంది. అంతేకాదు అక్కడి ప్రతిష్టాత్మకమైన Odeon BFI IMAXలో కూడా ప్రదర్శితం కానుంది. ఈ థియేటర్ UKలోని అతిపెద్ద IMAX స్క్రీన్. BFI IMAX లండన్ వాటర్‌లూలో ఉంది. కాబట్టి ఈ థియేటర్ పరిసరాల్లో నివసించే వ్యక్తులు మాత్రమే ఈ అతిపెద్ద థియేటర్ లో సినిమాను వీక్షించే అవకాశం ఉంటుంది.