టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్ బాట పట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాని ముగించుకొని వుంది. కాగా బాలీవుడ్ లో మాత్రం వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. అయితే తాజాగా రకుల్ మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించబోతోందట. అక్షయ్ తో బెల్ బాటమ్ సినిమా తీసిన రంజిత్ తివారీ, మరోసారి ఆయనతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా ఖరారు అయినట్లుగా బీటౌన్ లో ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. అయితే మొదట శ్రద్ధా కపూర్, కియారా అద్వానీల పేర్లు వినిపించిన రకుల్ ను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.