టాలీవుడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. హీరోగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్.. ప్రస్తుతం తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిపై సత్యదేవ్ స్పందిస్తూ.. ‘కొన్ని విషయాలు మనం ఊహించకుండానే జరిగిపోతుంటాయని ఆనందాన్ని వ్యక్తం’ చేశారు.