తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకతను ప్రశంసించారు. 1970లో కనీస మౌలిక సదుపాయాలు లేని ఈ ప్రాంతంలో దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో, అప్పటి నుండి అది హైదరాబాద్‌లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మరియు సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తుచేసుకుంటూ, సంస్థ యొక్క గొప్ప వారసత్వాన్ని భట్టి విక్రమార్క ప్రశంసించారు. అన్నపూర్ణ కళాశాలలో ప్రపంచ స్థాయి చలనచిత్ర విద్య ద్వారా ఈ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో నాగార్జున అక్కినేని మరియు అమల అక్కినేని విజన్ ను ఆయన అబినందించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ “అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన రోల్ నంబర్ 52ని నేను చూశాను. నాకు ఎంతగానో నచ్చింది, మనసుని హత్తుకునే మంచి సినిమా తీసినందుకు దర్శకుడిని వారి టీమ్ ను అభినందిస్తున్నాను. “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మరియు ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ సినీ దిగ్గజాల మద్దతు కోసం మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు. అన్నపూర్ణ కళాశాలలో ఎందరో ప్రతిభావంతులు, వారి ప్రతిభ గురించి అక్కినేని నాగార్జున స్వయంగా నాతో మాట్లాడారు, అదే నన్ను ఇన్స్పైర్ చేసింది. మీ అందరిని కలవడానీకే ఇక్కడికి వచ్చాను.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘ నా తండ్రి ANR తెలుగు చిత్ర పరిశ్రమను చెన్నై నుండి హైదరాబాద్‌కు తరలి వచ్చినపుడు ఆయన విజన్ కు అనుగునంగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబడింది. నేడు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో భారతదేశంలోని అత్యుత్తమ సంస్థలలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటిగా నిలిచింది. అన్నపూర్ణ కళాశాల భవిష్యత్ కథకులను పెంపొందించాలనే తన కలను కొనసాగిస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ రోజు మా స్టూడియోస్ ను సందర్శించం మాకు గౌరవంగా ఉంది. ప్రపంచ సినిమాలో తెలంగాణ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాము.
అనంతరం డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నపూర్ణ స్టూడియోస్, ANR సౌండ్ & విజన్ – భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ ఫెసిలిటీ సినిమాను కూడా సందర్శించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు మరియు అత్యాధునిక సాంకేతికత వివరాలు అడిగి తెల్సుకుని నాగార్జునను మెచ్చుకున్నారు.