Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ రూపం. యంగ్ హీరోలకు పోటీగా ఆయన మెయిన్‌టేన్ చేసే ఫిట్‌నెస్. 60వ వడిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు యూత్‌లో ఫాలోయింగ్ తగ్గలేదంటే ఆయన ఏ రేంజ్‌లో ఫిట్‌నెస్ మీద దృష్టి సారించారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా చాలా మంది అమ్మాయిల కలల మన్మథుడు నాగార్జున అని స్వయాన నాగ్ కుమారులే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగార్జున కుమారుడు నాగచైతన్య పాల్గొని మాట్లాడుతూ.. నేను, అఖిల్, నాన్న (నాగార్జున) ముగ్గురం కలిసి బయటికి వెళ్తే ముందుగా అందరూ(అమ్మాయిలు) ఫోటోల కోసం, ఆటోగ్రాఫ్‌ల కోసం వచ్చేది నాన్న దగ్గరికే అని చెప్పారు.
READ ALSO: స్టైలిష్ లుక్, ADAS లెవెల్ 2 ఫీచర్, అబ్బురపరిచే ఫీచర్లతో లాంచ్కు సిద్దమైన Hyundai Venue N..!
ఇది ఇలా ఉంటే.. ఇటీవల నాగార్జున ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. అసలు తను సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చింది, తన మొదటి సినిమా సైన్ చేసిన నాటి సంఘటనలు చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో నాగ్ తన మొదటి సినిమా విక్రమ గురించి మాట్లాడుతూ.. తన మొదటి సినిమా విక్రమ్ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు సెలెక్ట్ చేశారని చెప్పారు. ఈ సినిమా హిందులో జాకీష్రాఫ్ చేశారని, ఆయనకు కూడా ఇదే మొదటి సినిమా అని అన్నారు. దాంతో తెలుగు వెండి తెరకు కొత్తగా పరిచయం కాబోతున్న తనకు కూడా ఈ సినిమా అయితే బాగుంటుందని నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) అభిప్రాయపడ్డారని చెప్పారు. ఈ సినిమా విషయంలో ఆయన నిర్ణయం ఫైనల్ అయ్యిందని చెప్పారు. అలా తన మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. ఆ సినిమా తర్వాత వరుసగా ఏడు సినిమాలు చేశానని దాని తర్వాత రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ సినిమా చేసినట్లు చెప్పారు. శివ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కొత్త దర్శకుడిగా పరిచయం అయిన రామ్‌గోపాల్ వర్మ తర్వాత ఎన్ని సంచలన సినిమాలకు దర్శకత్వం వహించారో తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున తన కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.
READ ALSO: India – America: భారత్-అమెరికా మధ్య దోస్తి.. 10 ఏళ్లకు కుదిరిన రక్షణ ఒప్పందం