Akkineni Award: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒక కీలక ప్రకటన చేశారు. అదేమంటే గత కొన్నాళ్లుగా ఇస్తున్నట్టు ఈ ఏడాది కూడా అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇస్తున్నామని ఆయన కుమారుడు నాగార్జున ప్రకటించారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు అందించబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబర్ 28వ తేదీన ఒక ఘనమైన వేడుక జరగబోతున్నామని ఆ వేడుకల్లోనే మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకి అందించబోతున్నట్లుగా ప్రకటించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు అందించబోతున్నట్లుగా ప్రకటించారు.
Also Read: Pailam Pilaga Review: పైలం పిలగా రివ్యూ
ఇక అక్కినేని నాగేశ్వరావు శ్రద్ధ జయంతి వేడుకల సందర్భంగా ఒక పోస్టల్ స్టాంప్ ని కూడా ఈ రోజు లాంచ్ చేశారు. హైదరాబాద్ ఆర్కే సినీ ప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో నాగర్జునతో పాటు అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య, సుప్రియ, నాగ సుశీల, సుమంత్, సుశాంత్ వంటి వాళ్ళు పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ నాన్న ఎప్పడూ మాతోనే ఉన్నారు. నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు, హెరిటేజ్ ఫౌండేషన్ వారు నాన్న గారి 10 సినిమాలను 4k క్వాలిటీలో దేశంలోని 30 ప్రధాన నగరాలలో ప్రదర్శిస్తున్నారు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని ఆయన అన్నారు.