ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటించిన ఈ సినిమాను ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.
లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ మూవీ గురించి నిర్మాత మాట్లాడుతూ, ”ఈ సినిమా పాటలు హిట్ అయ్యాయి. ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఇవన్నీ సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం మూవీ స్థాయిని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. ఈనెల 24న సినిమాను విడుదల చేయబోతున్నాం” అని చెప్పారు. విశేషం ఏమంటే…. జూన్ 24వ తేదీనే దాదాపు ఏడెనిమిది మీడియం బడ్జెట్ మూవీస్ సైతం జనం ముందుకు రాబోతున్నాయి.