యువ నటుడు ఆకాష్ పూరి, క్రియేటివ్ డైరెక్టర్ జీవన్ రెడ్డిల కాంబోలో రూపొందిన ఒక న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా “చోర్ బజార్” థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ ఇప్పుడు సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. “చోర్ బజార్” టైటిల్ సాంగ్‌ని ఈరోజు ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేశారు. “చోర్ బజార్ టైటిల్ సాంగ్ “కిక్కాస్”… ఈ ప్రత్యేకమైన సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్వాగ్, ఉల్లాసమైన ట్యూన్ తో ఆకట్టుకుంటుంది. ర్యాప్ పోర్షన్ తో పాటు పాట మొత్తం నాకు బాగా నచ్చింది. ఆకాష్ తనకు బాగా సరిపోయే సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అన్నారు రామ్.
Read Also : Breakup : ఎట్టకేలకు స్పందించిన షణ్ముఖ్
రామ్ చెప్పినట్లుగా “చోర్ బజార్” టైటిల్ సాంగ్ చిత్రం నేపథ్యాన్ని వర్ణిస్తుంది. ఇది మామూలు టైటిల్ సాంగ్స్ లా కాకుండా ర్యాప్ తో ప్రత్యేకంగా ఉంది. నవాబ్ గ్యాంగ్ అండ్ అసురన్ బృందం చేసిన రాప్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రాన్ని విఎస్ రాజు నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను రానున్న రోజుల్లో మేకర్స్ వెల్లడించనున్నారు. ఈ సాంగ్ చూస్తుంటే ఈసారి ఆకాష్ మంచి గ్రిప్పింగ్ ఉన్న కథతో ప్రేక్షకులను అలరించబోతున్నాడని అన్పిస్తోంది.