అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎయిర్ హోస్టెస్ మనీషా థాపా కూడా ఉంది. మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి. ఆమె మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగుతోపాటు తాను చదివిన కళాశాలలో సైతం విషాదకరంగా మారింది. మనీషా మృతిపై ఆమె మామ ప్రవీణ్ తమంగ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కుటుంబం షాక్‌లోకి జారుకుందన్నారు.. మనీషా కెరీర్ ఇప్పుడే…
భారతీయ విమానయాన సంస్థలకు గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈరోజు.. ఆదివారం (అక్టోబర్ 27న) ప్రయాణికులతో నిండిన కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇన్ని బెదిరింపు కాల్స్ రావడంతో.. ఇది విదేశీ కుట్రనా.. లేక నిజంగానే ఎవరైనా కావాలనే చేస్తున్నారా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది.
Hoax bomb threat: గత మూడు రోజులుగా భారతీయ విమానసంస్థలు నకిలీ బాంబు బెదిరింపుల్ని ఎదుర్కొంటున్నాయి. సోమవారం నుంచి ఈ రోజు బుధవారం వరకు మొత్తం 12 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి, ఢిల్లీ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాస విమానానికి బాంబు ఉందంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయి. మంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిరిండియా విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో విమానాన్ని కెనడాలోని ఓ…
Bomb threats: దేశంలో వరసగా విమానాలు బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్నాయి. బుధవారం కూడా మరో రెండు విమానాలకు ఇలాంటి వార్నింగ్స్ వచ్చాయి. బెంగళూర్ నుంచి బయలుదేరే ఆకాసా ఎయిర్ విమానానికి, ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానానికి బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల్లో ఇలా 12 విమానాలకు నకిలీ బెదిరింపులు రావడం సంచలనంగా మారాయి.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
Smoking Beedi On Flight: విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్న వ్యక్తి, నిబంధనలు తెలియక బీడీ తాగాడు. దీంతో అరెస్ట్ అయ్యాడు. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి మంగళవారం అహ్మదాబాద్‌లో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగా.. మరుగుదొడ్డికి వెళ్లిన అతను అక్కడ బీడీ తాగాడు.
దేశీయ ప్రమఖ ఎయిర్ లైన్ సంస్థ అయిన ఆకాశ ఎయిర్ గతేడాది ఆగస్టులో దేశంలో తన విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి దశలో భాగంగా దేశంలోని ప్రముఖ నగరాలను కనెక్ట్ చేస్తూ తన విమాన సర్వీసులను ప్రారంభించిన ఆకాశ ఎయిర్.. ఇప్పుడు క్రమంగా దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించడానికి ప్రణాళికలను రూపొందించుకుంటుంది.
Flight Journeys: మన దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. 2021వ సంవత్సరంతో పోల్చితే 2022లో 47 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. దేశీయ విమాన ప్రయాణాల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. DGCA.. లేటెస్ట్‌గా వెల్లడించింది. 2022లో 12 కోట్ల 32 లక్షల 45 వేల మంది ఫ్లైట్లలో జర్నీ చేయగా 2021లో 8 కోట్ల 38 లక్షల 14 మంది మాత్రమే ప్రయాణించారు. 2022 నవంబర్ కన్నా డిసెంబర్‌లో 13 పాయింట్ ఆరు…
Today (25-01-23) Business Headlines: Airtel మినిమం రీఛార్జ్ రూ.155: Airtel ప్రీపెయిడ్ మినిమం రీఛార్జ్ ఒక్కసారే 57 శాతం పెరిగి 155 రూపాయలకు చేరింది. దీంతో ఇప్పుడున్న 99 రూపాయల ప్లాన్ రద్దయింది. కొత్త ప్లాన్.. ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇందులో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ఒక జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ అందిస్తారు. హలో మ్యూజిక్, వింక్ మ్యూజిక్ సర్వీసులు సైతం ఉచితం.
Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది.