అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎయిర్ హోస్టెస్ మనీషా థాపా కూడా ఉంది. మనీషా బీహార్ రాజధాని పాట్నా నివాసి. ఆమె మరణ వార్త విన్న తర్వాత కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇరుగుపొరుగుతోపాటు తాను చదివిన కళాశాలలో సైతం విషాదకరంగా మారింది. మనీషా మృతిపై ఆమె మామ ప్రవీణ్ తమంగ్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కుటుంబం షాక్‌లోకి జారుకుందన్నారు.. మనీషా కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని.. అంతలోపే ముగిసిందని భావోద్వేగానికి లోనయ్యారు.
READ MORE: Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!
గ్రౌండ్ స్టాఫ్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మనీషా ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ అయ్యింది. మనీషా థాపా కల ఎయిర్ హోస్టెస్ కావడమే. దాని కోసం మొదట ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆకాసా ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూగా పనిచేసింది. అనంతరం ఎయిర్ ఇండియాలో చేరింది. ప్రమాదానికి ముందు.. ఆమె లండన్, ఆస్ట్రేలియాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. తన కల నేరవేరిన కొద్ది రోజుల్లోనే అనంతలోకాలకు చేరుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేరీర్ ప్రారంభంలోనే ఇలా జరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”
మనీషా థాపా పాట్నాలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ నుంచి బీబీఈ డిగ్రీ పొందింది. ఆమె మరణ వార్త తెలియగానే కళాశాలలో శోకసంద్రం అలుముకుంది. శనివారం కళాశాల క్యాంపస్‌లో మనీషా థాపా జ్ఞాపకార్థం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మనీషా అకాల మరణం పట్ల ఆ సంస్థ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు.