దేశీయ ప్రమఖ ఎయిర్ లైన్ సంస్థ అయిన ఆకాశ ఎయిర్ గతేడాది ఆగస్టులో దేశంలో తన విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి దశలో భాగంగా దేశంలోని ప్రముఖ నగరాలను కనెక్ట్ చేస్తూ తన విమాన సర్వీసులను ప్రారంభించిన ఆకాశ ఎయిర్.. ఇప్పుడు క్రమంగా దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించడానికి ప్రణాళికలను రూపొందించుకుంటుంది. దీనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యకు పెంచుకోవాలని యోచిస్తోంది.
Also Read:CM KCR: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు
అకాశ ఎయిర్ దాదాపు 1,000 మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. 2024 మార్చి చివరి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్యను 3,000 కంటే ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఎయిర్‌లైన్ తన విమానాలను అలాగే మార్గాలను విస్తరించేందుకు కూడా ప్రణాళిలు సిద్ధం చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దూబే తెలిపారు.
ఏడు నెలల క్రితమే ప్రారంభమైన ఈ ఆకాశ ఎయిర్‌లైన్.. ఈ సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని కూడా యోచిస్తోంది. విదేశీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని వివిధ సర్వీస్లును పెంచాలని భావిస్తోంది. ఆకాశ ఎయిర్ లైన్స్ మొత్తం 72 బోయింగ్ 737 మాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. వాటిలో 19 విమానాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక, 20వ విమానం ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు కూడా అర్హత పొందుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 9 విమానాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మొత్తం విమానాల సంఖ్యను 28కి చేరనుంది. ప్రస్తుతం, ఇది ప్రతిరోజూ 110 విమాన సర్వీసులు నడుపుతోంది.
Also Read:Kayleigh Scott: ఆ సెలెబ్రిటీ ఫ్లైట్ అటెండెంట్ ఇక లేదు.. పోస్టు పెట్టి మరీ..
ప్రస్తుతం తమ వద్ద 2,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆ సంఖ్య మూడు వేలకు చేరుతుందని వినయ్ దూబే అన్నారు. వారిలో దాదాపు 1,100 మంది పైలట్లు , ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల ప్రతిభ ఆధారంగానే నియామకం ఉంటుందని చెప్పారు. ఆర్డర్‌లో ఉన్న మొత్తం 72 బోయింగ్ విమానాల డెలివరీ 2027 ప్రారంభంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలతో ఉద్యోగాల కోత వార్తలు నిత్యం దర్శనమిస్తున్నాయి. దిగ్గజ కంపెనీల లేఆఫ్ లో భాగంగా తమ ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగిస్తున్నారు. అయితే, ఆకాశ ఎయిర్ లైన్స్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు నియామకాలు చేపట్టడం విశేషం.