Rakesh Jhunjhunwala passes away: స్టాక్ మార్కెట్ దిగ్గజం, బిగ్ బుల్ రాకేష్ రాకేష్ ఝున్ ఝున్ వాలా(62) ఆదివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాకేష్ ఝున్ ఝున్ వాలా. ఇండియాలో స్టాక్ మార్కెట్ దిగ్గజంగా ఎదిరిన ఝున్ ఝున్ వాలా ఇటీవల ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఉదయం తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్న ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఉదయం 6.45 గంటలకు ఆస్పత్రికి తరలించే సమయంలోనే కన్నుమూశారు. రాకేష్…
రెండు రోజులుగా ఇండిగో ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లు మూమకుమ్మడి సిక్ లీవులు పెట్టినట్లు తెలుస్తోంది. తమకు ఇస్తున్న తక్కువ జీతాలకు వ్యతిరేకంగా హైదరాబాద్, ఢిల్లీల్లో సిక్ లీవుల్లో వెళ్లారని తెలుస్తోంది. గతంలో జూలై 2న ఇండిగో క్యాబిన్ సిబ్బంది ఒకే సారి సిక్ లీవులు తీసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. క్యాబిన్ సిబ్బంది సిక్ లీవుల్లో వెల్లడంతో దేశీయంగా 55 శాతం ఆలస్యం అయ్యాయి. అయితే వీరంతా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు వెళ్లినట్లు…
భారతదేశంలోకి మరో ఎయిర్ లైన్ సంస్థ అడుగుపెట్టబోతోంది. బిలియనీర్, షేర్ మార్కెట్ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ‘ ఆకాశ ఎయిర్’ త్వరలోనే ఇండియాలో తన సేవలను ప్రారంభించబోతోంది. ఆకాశ ఎయిర్ కమర్షియల్ విమానాలను ప్రారంభించేందుకు ఏమియేషన్ రెగ్యులేటర్ అథారిటీ, డీజీసీఏ నుంచి అనుమతి వచ్చింది. ఆకాశకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) ను డీజీసీఏ ఇచ్చింది. దీంతో ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఫ్లైట్స్ నడపడానికి మార్గం సుగమం అయింది. డీజీసీఏ నిర్ణయంపై ఆకాశ ఎయిర్ హర్షం వ్యక్తం…
దేశంలో విమానయాన రంగం మళ్లీ పుంజుకుంటోంది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పౌరవిమానయానం తిరిగి గాడిలో పడింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకున్నాక మరిన్ని ప్రైవేట్ సంస్థలు విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ఆకాశ ఎయిర్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ త్వరలోనే భారత్‌లో విమానాలు నడపబోతున్నది. ఆకాశ ఎయిర్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాయాన సంస్థకు పౌరవిమానయాన శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్…