Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయానికి మహాయుతిలోని శివసేన, ఎన్సీపీలు అంగీకరించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉండబోతున్నారు. తాజాగా అమిత్ షాతో సమావేశమైన ముగ్గురు ఈ ప్రతిపాదనకు అంగీకరించారని తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది.
Maharashtra: మహారాష్ట్ర సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఎవరు సీఎం అయిన శివసైనికులు మద్దతు ఇస్తారని, తాను బాల్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీ నుంచే ఉంటారని తెలుస్తోంది.
Eknath Shinde: శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఈరోజు (మంగళవారం) రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు అందజేశారు.
Maharashtra: మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు (మంగళవారం)తో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది.
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు.
Maharashtra New CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
Sharad Pawar: ఘోర పరాజయం తర్వాత తొలిసారి ఎన్సీనీ (ఎస్పీ) నేత, సీనియర్ నాయకులు శరద్ పవార్ స్పందించారు. తాము ఆశించిన రీతిలో ఫలితాలు లేవని అన్నారు. “మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. కారణాలను అధ్యయనం చేసి ప్రజల్లోకి వెళ్తా. ఇది ప్రజల నిర్ణయం. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడమే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత విజయం సాధించడానికి కారణం కావచ్చు’’ అని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. ఊహించని ఫలితాలను సాధించింది. ఏకపక్షంగా మహాయుతి కూటమి పక్షాన ప్రజలు నిలబడ్డారు. ఇక ఎన్సీపీ అధినేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భారీ విజయం సాధించారు.