అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అమెరికా నుంచి వెళ్లాల్సిన లేదా రావాల్సిన 538 విమానాలు 5జీ సేవల ప్రారంభం వల్ల రద్దు కానున్నాయని తెలుస్తోంది. రద్దయిన విమాన సర్వీసులలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ విమానాల్లోని…
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే థర్డ్ వేవ్ ఎంటర్ అయినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిస్క్, ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చేవారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కు పంపుతున్నారు. శాంపిల్స్‌ను జీనోమ్…
టీఎంసీ ఎంపీ నుస్రత్ ఖాన్ మోడీ ప్రభుత్వం తీరుపై లోక్ సభలో మండిపడ్డారు. దేశంలో నవరత్న, మహారత్న కంపెనీలను అమ్మేయడంపై ఆమె తీవ్రంగా విమర్శించారు. లాభాల్లో వున్న నవరత్న కంపెనీలను ఎడాపెడా అమ్మేయడం ఏంటన్నారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తూ.. దేశ సంపదను పెంచే కంపెనీలను ఎలా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తారని నుస్రత్ ఖాన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. నుస్రత్ ఖాన్ ప్రసంగం లోక్ సభలో చర్చనీయాంశం అయింది. సెయిల్, గెయిల్, కోల్ ఇండియా, ఎయిర్ ఇండియా…
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముంబై వయా హైదరాబాద్ మీదుగా జగ్దల్ పూర్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గత మూడు గంటలుగా ఎయిర్‌పోర్ట్ లో పడి కాపులు కాస్తున్న ప్రయాణీకులు సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీస్తున్నారు. ఎయిర్ ఇండియా సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ఎయిర్‌పోర్ట్ లో బైఠాయించారు ప్రయాణీకులు. ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదం కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా…
మన దేశంలో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైలు ప్రయాణాలు ఉచితం లేదా రాయితీలు వంటి అనేక సౌకర్యాలు ఉంటాయి. అయితే ఇకపై అలాంటి సౌకర్యాల్లో ఇప్పుడు కోత పడనుంది. ఇప్పటివరకు ఉచితంగా విమానాల్లో ప్రయాణం చేసే ఎంపీలు భవిష్యత్‌లో టిక్కెట్ కొని ప్రయాణించాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిరిండియా ప్రైవేట్ పరం కావడమే. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను వేలంపాటలో టాటా గ్రూప్ కొనుగోలు చేసిన…
అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ చేజిక్కించుకున్నది. ఎయిర్ ఇండియా సంస్థను టాటాలే స్థాపించారు. ఆ తరువాత అందులో భారత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడంతో అది ప్రభుత్వరంగ సంస్థగా మారింది. కాగా, ఇప్పుడు ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోవడంతో తిరిగి టాటాలు బిడ్‌లో దక్కించుకున్నారు. తాము స్థాపించిన సంస్థ తిరిగి టాటాలకు చేరడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్న రతన్ టాటాకు ముంబైలోని సర్ రతన్ టాటా ఇనిస్టిట్యూట్…
కొన్నేళ్ల నుంచి ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సహజంగానే అది అందులో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. జీతాల్లో కోత…చెల్లింపులో ఆలస్యం..ఉద్యోగుల తొలగింపు వంటివి ఎలాగూ ఉంటాయి. వేల కోట్ల అప్పుల భారంతో ఉన్న సంస్థకు ప్రభుత్వం ఇక ఏమాత్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఎయిరిండియా ఉద్యోగులకు ఎప్పుడో అర్థమైంది. దాంతో కొంత కాలంగా వారు భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. లక్ష కోట్ల మేర రుణ భారంతో కుంగిపోయిన ఉన్న ఎయిర్ ఇండియా అమ్మకానికి 2018లో…
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాని ప్రైవేట్‌కు అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఎట్టకేలకు గత శుక్రవారం ఎయిర్ ఇండియా-AI లో తన వాటాలన్నింటినీ విక్రయించేసింది. దాంతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ -AIXL, ఎయిర్ ఇండియా SATS ..అంటే ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్-AISATSలు కూడా ఇందులోకి వస్తాయి. ఏడు దశాబ్దాల తరువాత ఎయిర్ ఇండియా తిరిగి తన మాతృ సంస్థ టాటాల చేతిలోకి వెళ్లింది.…
రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్..…
ఎయిరిండియా బిడ్ దక్కించుకుంది టాటా సన్స్.. ఎయిరిండియాపై కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది… రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లింది… అయితే, టాటా సన్స్ అధినేత జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ టాటా.. భారత్‌లో విమానయాన సర్వీసులను ప్రారంభించారు.. 1938లో విదేశాలకు కూడా విమాన సర్వీసులను విస్తరించారు.. మొదట టాటా ఎయిర్ సర్వీసెస్ గా ఉండగా..…