1930 దశకంలో ఇండియాలో టాటాలు విమానాలను ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం రావడానికి ముందు ఏడాది అంటే 1946లో టాటా కంపెనీ ఎయిర్‌లైన్స్‌కు పేరును పెట్టాలనుకున్నారు. దీనికోసం నాలుగు పేర్లను సెలక్ట్ చేసి బాంబే సంస్థలోని ఉద్యోగుల వద్ద ఉంచి ఓటింగ్‌ను నిర్వహించారు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్, పాన్ ఇండియన్ ఎయిర్‌లైన్స్, ట్రాన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్లను ఉద్యోగుల ముందు ఉంచగా, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్లు మొదటి రెండు ప్లేసులలో నిలిచాయి. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని నిర్వహించగా ఈ పోటీలో ఎయిర్ ఇండియా కు 72 ఓట్లు రాగా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 58 ఓట్లు లభించాయి. మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్ ఇండియా పేరును టాటాలు ఎయిర్‌లైన్స్‌కు ఖరారు చేశారు. ఆ తరువాత ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతిలోకి వెళ్లింది. కాగా, 2020 లో ఎయిర్ ఇండియాను తిరిగి టాటాలకు అప్పగించింది భారత ప్రభుత్వం.
Read: ఎంజీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్…ధర ఎంతంటే…