Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్‌లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకున్నారని…
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సస్పెండ్ అయిన బీజేపీ నేత నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ బీజేపీ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథురాం గాడ్సేను ఆరాధించే వ్యక్తులను ముస్లింలు ఎన్నటికీ విశ్వసించలేరు కాబట్టి ముస్లింలు బీజేపీకి ఎన్నటికీ ఓటు వేయరని ఆయన అన్నారు.
అతివాద సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా'(పీఎఫ్ఐ)ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… సంస్థ సభ్యులకు ముష్కర ముఠాలతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది… తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని.. ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం.. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలను సైతం నిషేధిత జాబితాలో చేర్చింది. పీఎఫ్ఐ వ్యవస్థాపకుల్లో చాలా మంది నిషేధిత సిమీ…
బీజేపీ నేత రాజా సింగ్‌ను రెండోసారి అరెస్టు చేసారని, శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్ ప్రకారమే రాజాసింగ్ అరెస్ట్ చేశారని ఒవైసీ పేర్కొన్నారు కావున ముస్లీం ప్రజలు ప్రశాంతంగా మసీదుల్లో ప్రార్థనలు జరుపుకోవాలని కోరారు. #Hyderabad की आवाम को @aimim_national प्रमुख @asadowaisiका पैगामहमारी सबसे बड़ी डिमांड यही थी कि जिस शख्स ने ऐसी बकवास की…
టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదుయాష్కీ గౌడ్… ఆ మూడు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించిన ఆయన.. దేశంలో ఎక్కడ మతతత్వ అల్లర్లు జరిగిన హైదరాబాద్ తోనే లింక్ ఉంటుందన్నారు.. ఇక, ఇలాంటి సంఘటనలలో కేంద్రం సమగ్రమైన విచారణ జరిపించడంలో విఫలమైందని మండిపడ్డారు మధుయాష్కీ గౌడ్.. మరోవైపు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన సంఘటనలలో నిందితులకి భారతీయ జనతా పార్టీ వాళ్లతో లింకులు ఉన్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత..…
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, వివాదాస్పద సాధువు యతి నరసింహానందపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలను చూసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీసుల గురించి అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో…
కాశీలోని జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 22 గదులు తెరవాలంటూ కోర్టు ఆశ్రయించారు. అయితే తాజాగా జ్ఞాన్‌వాపి మసీదులో బయట పడ్డ శివలింగంపై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేశాన్ని చీకట్లోకి నెట్టేయాలని సంఘ్ పరివార్ యోచిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్‌వాపి, మధుర వంటి విషయాల్లో సంఘ్ పరివార్ ద్వేషపూరిత…
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పర్యటనపై వివాదం అయిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని 5 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది భారత పురావస్తు శాఖ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఇటీవల అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించడంపై మహారాష్ట్రలో భారీ వివాదం నెలకొంది.. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నాన్ని పరిరక్షిస్తున్న భారత పురావస్తు శాఖ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అంతకుముందే మసీదు కమిటీ ఆ స్థలాన్ని తాళం వేయడానికి…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిన్న, నేడు తెలంగాణలో పర్యటించిన విషయం విధితమే. అయితే.. నిన్న వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ’ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీలకు ఛాలెంజ్ విసరడానికే తాను రాష్ట్రానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ.. తెలంగాణాకు ఎవరైనా రావొచ్చన్న అసద్.. రాహుల్కు తెలంగాణ గురించి ఏమీ తెలియదన్నారు. అంతేకాకుండా.. ఏం మాట్లాడాలో అని అడిగిన రాహుల్…