సరూర్ నగర్ పరువు హత్య కేసుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని… అది సరైందేనని ఒవైసీ అన్నారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా… ఇది నేరపూరిత చర్య అన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు…
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ…
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్‌రావు.. బోధన్‌లో నెలకొన్ని పరిస్థితులు, బంద్.. తదితర అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ.. భారత దేశంలో ఉందా..? లేక పాకిస్థాన్‌లో ఉందా..? అని నిలదీశారు.. కేసీఆర్ తన మహారాష్ట్ర పర్యటనలో ఛత్రపతి శివాజీని పొగిడారు.. కానీ, నిన్న బోధన్‌లో శివాజీ విగ్రహం అంశంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి హిందువులపై దాడి చేశాయని ఆరోపించారు.. ఇక, దాడులకు…
గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. కాంగ్రెస్ ను ఏం చేస్తారనేది జీ23 నేతలే చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు క్వార్టర్ పొడిగించాలని ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వెళ్లాయన్నారు. దీనిక వెనక మతలబు ఏంటని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినా… బీజేపీ తమకు శతృవునేనన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లలో…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎంఐఎం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ప్రశ్నిస్తుండగా.. కేసీఆర్‌ను ఎంపీ అసదుద్దీన్ ప్రశంసించారు. కేసీఆర్‌ను మొండి మనిషి అంటూ ఎంపీ అసదుద్దీన్ ప్రశంసించారు.. కేసీఆర్ గతంలో కంటే యాక్టివ్ అయ్యారన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ యాక్టివ్‌గానే ఉండాలన్నారు.. ఇక, దేశంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను మించిన నాయకుడు మనకు లేరన్నారు ఒవైసీ.. దేశ రాజకీయాలపై కేసీఆర్…
తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీకే పరిమితం అయిన ఎంఐఎం పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరణపై గురిపెట్టింది.. అందులో భాగంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీ చేస్తూ వస్తోంది.. ఇక, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు ఆ పార్టీ అభ్యర్థులు.. వారి తరపున ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు కూడా కలకలం సృష్టించాయి.. కానీ, యూపీలో…
భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు విజయశాంతి.. ముఖ్యంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై, కేంద్ర బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంపై ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు రాములమ్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుతో ఆయన పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం…
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని దుండగులు టార్గెట్ చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఒవైసీ.. ముఖ్యంగా యూపీలోకి కేంద్రీకరించి అభ్యర్థులను బరిలోకి దింపారు.. ఇదే సమయంలో ఒవైసీని టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీలో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్తున్న ఒవైసీ కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన..…